వక్కంతం వంశీ డైరెక్టర్ గా..!
- April 20, 2016
సినిమా ఫీల్డ్ లో ఒక్కొక్కరు ఒక్కోరకంగా పేరు తెచ్చుకోవాలనుకుంటారు. కొందరు నటులుగా, మరికొందరు డైరెక్టర్లుగా, లేదా టెక్నీషియన్స్ గా రాణించాలనుకుంటారు. ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. కొందరికి త్వరగా, మరికొందరికి కాస్త ఆలస్యంగా అవకాశాలు పలకరిస్తుంటాయి . అయితే ఎంతోకాలంగా డైరెక్టర్ అవుదామని వెయిట్ చేసిన ఓ రైటర్ త్వరలోనే మెగా ఫోన్ పట్టే ఛాన్స్ కనిపిస్తుంది .స్టార్ రైటర్ వక్కంతం వంశీ ఇప్పటి వరకు రైటర్ గా కొన్ని సినిమాలకు చేసారు. ఇప్పుడు డైరెక్టర్ గా మొదటి మూవీని జూనియర్ ఎన్ టీఆర్ తో చేయాలనుకున్నాడు. కానీ యంగ్ టైగర్ బిజీగా ఉండడంతో వక్కంతానికి ఛాన్స్ కుదరలేదు. తన తొలి చిత్రం ఎన్టీఆర్ తోనే అని, స్టోరీ కూడా రెడీ చేసుకుంటున్నానని చాలాసార్లు మీడియాకు కూడా చెప్పాడు వక్కంతం వంశీఎన్టీఆర్, వంశీకు ..స్క్రిప్టుని రెడీ చేసుకోమని, ఇంకెవరికీ ఆ కథను వినిపించొద్దని చెప్పాడట. సెప్టెంబర్ నుంచి ఆ సినిమా మొదలు పెడదామని, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి సిద్ధంగా ఉండమని కూడా యంగ్ టైగర్ వంశీకి చెప్పాడట. ఈ ఎంకరేజ్ మెంట్ తో పొంగిపోయిన వక్కంతం జూన్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాడట.జూనియర్ ఎన్టీఆర్ తో వక్కంతం ఏ తరహా సినిమా చేస్తాడనే ఊహాగానాలు సహజంగానే ఉంటాయి. ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ ఎంటర్టైనర్ అని, ఊహించని ట్విస్ట్ లతో సాగే విభిన్నమైన కథనంతో వక్కంతం తన తొలి చిత్రం కథను రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎట్ ప్రెజెంట్ ఎన్టీఆర్...తన తాజా చిత్రం జనతా గ్యారేజ్ షూటింగ్ బిజీలో ఉన్నాడు. ఆగస్టు 12 న ఈ చిత్రం రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







