పెరిగిన పసిడి, వెండి ధరలు
- April 20, 2016
బుధవారం బంగారం ధర పెరిగింది. రూ.105 పెరగడంతో 99.5శాతం స్వచ్ఛత గల పది గ్రాముల పసిడి ధర రూ.29,290కి చేరింది.అలాగే 99.9 శాతం స్వచ్ఛత గల పసిడి ధర రూ.29,185కు చేరింది. నగల వ్యాపారులు, స్టాకిస్టుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా యూరోపియన్ ట్రేడ్‌లో ఔన్సు బంగారం ధర 1,258 అమెరికన్ డాలర్లుగా ఉంది.
రూ.నలభై వేల మార్కును చేరిన వెండి బుధవారం వెండి రూ.40,000 మార్కును చేరింది. ఒక్కరోజులోనే రూ.1,615 పెరగడంతో కేజీ వెండి ధర రూ.40,290కి చేరింది. పారిశ్రామిక వర్గాల నుంచి కొనుగోళ్లు పెద్దఎత్తున జరగడంతో దీని ధర పెరిగిందని బులియన్ మార్కెట్ వర్గాలు తెలిపాయి.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







