బహ్రెయిన్‌కు హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం
- October 23, 2022
మస్కట్ : హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ బహ్రెయిన్ రాజ్యానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం వెళ్లనున్నారు. ఈ మేరకు దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ తెలిపింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్, బహ్రెయిన్ రాజ్యం మధ్య బలమైన సంబంధాలను మెరుగుపరచడానికి రెండు దేశాల నాయకత్వాలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. ఇందులో భాగంగా హిజ్ మెజెస్టి సుల్తాన్ హైతం బిన్ తారిక్ బహ్రెయిన్ వెళతారని ప్రకటించింది. బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇస్సా అల్ ఖలీఫా నుండి వచ్చిన ఆహ్వానం మేరకు అక్టోబర్ 24 నుండి రెండురోజులపాటు సుల్తాన్ బహ్రెయిన్‌లో అధికారిక పర్యటన చేయనున్నారని దివాన్ ఆఫ్ రాయల్ కోర్ట్ వెల్లడించింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2021 చివరి నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యం RO320.7mnకి చేరుకుంటుందని, 2022 మొదటి 6 నెలల్లో RO241.4mn వాణిజ్యం ఇరుదేశాల మధ్య జరిగింది. సుల్తానేట్‌లో మొత్తం RO566.2mn పెట్టుబడితో 876 బహ్రెయిన్ కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. ముఖ్యంగా బహ్రెయిన్ రాజ్యానికి ఎలక్ట్రికల్, ప్లాస్టిక్, అల్యూమినియం, మందులు ఎగుమతి జరుగుతుండగా.. ఒమన్ నుంచి ఇనుప ఖనిజాలు, బంగారు కడ్డీలు, ఎలక్ట్రిక్ వైర్లు బహ్రెయిన్ దిగుమతి చేసుకుంటున్నది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!







