దుకాణాలు, మాల్స్‌లో దీపావళి సందడి

- October 23, 2022 , by Maagulf
దుకాణాలు, మాల్స్‌లో దీపావళి సందడి

యూఏఈ: భారతీయ ‘వెలుగుల పండుగ’ దీపావళి వేడుకలు గల్ఫ్ లో ఘనంగా జరుగుతున్నాయి. దుకాణాలు, మాల్స్ ప్రవాసులతో సందడిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆభరణాల దుకాణాలు ధన్‌తేరస్‌ను పురస్కరించుకొని రద్దీ నెలకొంది. దాదాపు రెండేళ్ల తర్వాత దీపావళి పండుగకు ఇంత మంది కస్టమర్లను చూడటం సంతోషంగా ఉందని పలువురు అభరణాల దుకాణం దారులు సంతోషం వ్యక్తం చేశారు. సాధారణ రోజులకంటే 50-75 శాతం ఎక్కువ మంది కస్టమర్‌ర్లు దీపావళి పండుగ వేళలో వస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు బంగారం ధర 184.50 దిర్హాలకు పడిపోవడంతో కోనుగోళ్లు పెరిగాయని అబుధాబిలోని అజంతా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ తుషార్ పాట్నీ తెలిపారు. అబుధాబిలోని మజ్యాద్ మాల్‌లోని అతిపెద్ద షోరూమ్ అయిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రోజంతా కొనుగోలుదారులతో కిటకిటలాడింది. ధంతేరస్, దీపావళిని దృష్టిలో ఉంచుకుని, గత నెలలో మేము ముందస్తు చెల్లింపు పథకాన్ని ప్రారంభించామని, ప్రతి Dh3,000 విలువైన కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా అందిస్తున్నామని బ్రాంచ్ మేనేజర్ అరుణ్ కుమార్ తెలిపారు. మరోవైపు షాపింగ్‌ మాల్స్‌, షాపులన్నీంటిని రంగురంగుల దీపాలతో అలకరించారు. అబుధాబిలోని మదీనాత్ జాయెద్ షాపింగ్ సెంటర్ వారాంతంలో లులు 'దీపావళి మేళా'లో భాగంగా నిర్వహించిన సంగీతం, నృత్యం, ఫుడ్ స్టాల్స్‌ ప్రవాసులతో నిండిపోయింది.  అబుధాబిలోని రీమ్ ఐలాండ్‌లోని 200 మందికి పైగా కమ్యూనిటీ సభ్యులు శనివారం సాయంత్రం నిర్వహించిన దీపావళి కార్యక్రమాల్లో పాల్గొన్నారని నివాసి అనిల్ కుమార్ కేజ్రీవాల్ వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com