లిబియాలో ఘోర ప్రమాదం..
- April 20, 2016
లిబియాలో ఘోర ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదం భయంతో ఈజిప్టు నుంచి లిబియా వైపు సముద్రం గుండా వలస వెళుతున్న వారి నౌక లిబియా తీరం మునిగిపోయినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో వలసదారులు నీటి మునిగిపోయినట్లు ఐక్యరాజ్య సమితి శరణార్థుల సంస్థ వెల్లడించింది. దాదాపు 500మందికి పైగా జలసమాధి అయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.అయితే ఈ బోటులో ప్రయాణించినవారిలో 41మంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. వీరిలో 37మంది పురుషులు, ముగ్గురు మహిళలు, మూడేళ్ల బాలుడు ఉన్నారు. మృతుల సంఖ్యపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఐరోపాలో కొనసాగుతున్న వలసల సంక్షోభంలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా నమోదు కానుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







