బీసీసీఐ నూతన సీఈవోగా రాహుల్ జోహ్రీని
- April 20, 2016
బీసీసీఐ నూతన సీఈవోగా రాహుల్ జోహ్రీని నియమిస్తున్నట్టు భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. జూన్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం రాహుల్ డిస్కవరీ నెట్ వర్క్స్ ఏసియా, ఫసిఫక్ కి ఉపాధ్యక్షునిగా, జనరల్ మేనేజర్ ఆఫ్ సౌత్ ఏషియాగా సేవలందిస్తున్నారు.బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ మాట్లాడుతూ.. రాహుల్ కి ఉన్న అపారమైన అనుభవం బీసీసీఐకి ఎంతగానో ఉపమోగపడుతుందని అన్నారు. రాహుల్ జోహ్రీ నియామకం పట్ల ఎంతో గర్వంగా ఉన్నమని ఆయన పేర్కొన్నారు. రాహుల్ ను సాదరంగా బోర్డులోకి ఆహ్వానిస్తున్నామని తెలిపారు. బీసీసీఐ సీఈవోగా నియామకంపై రాహుల్ స్పందిస్తూ.. ఇది తనకు లభించిన గొప్ప అవకాశంగా పేర్కొన్నారు. కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు సేవ చేసే అవకాశం లభించడం సంతోషకరమన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన బోర్డు అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







