ఇది కదా మాస్ అంటే.! ఇది కదా మెగాస్టార్ అంటే.!
- October 25, 2022
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 154వ చిత్రానికి తాజాగా టైటిల్ రిలీజ్ చేశారు. దీపావళికి సంబంధించి అసలు సిసలు ట్రీట్ ఇచ్చేశాడు మెగాస్టార్ ఈ అప్డేట్ తో.
ముందు నుంచీ చెబుతున్న మాటే.ఈ సినిమాకి ‘వాల్తేర్ వీరయ్య’ అని టైటిల్ పెడుతున్నామని. ప్రచారం జరిగినట్లే అదే టైటిల్ పెట్టేశారు. అయితే, అధికారికంగా రిలీజ్ చేశారంతే. టైటిల్ రిలీజ్ కోసం సిద్ధం చేసిన టీజర్ వుంది చూశారూ.. మెగా ఫ్యాన్స్‌లో పూనకాలొక్కటే తక్కువ.
తక్కువేంటీ.! పూనకాలు తెప్పించేశారంతే. అసలు సిసలు మాస్ దివాళీ ధమాకా అన్నమాట. వీరయ్యగా పక్కా ఊరమాస్ లుక్స్‌తో చేతిలో బీడీతో, మెగాస్టార్‌కి కొట్టిన పిండిలాంటి స్టైలిష్ మాస్ కటింగ్స్‌తో ప్రోమో చించేశాడంతే. ఓ యాక్షన్ బ్లాక్ నేపథ్యంలో రిలీజ్ చేసిన ప్రోమో ఇది.
స్ర్కీన్లు దద్దిరిల్లిపోవడం ఖాయం ‘వాల్తేర్ వీరయ్య’తో అని ఈ ఒక్క ప్రోమో ప్రూవ్ చేసేసేలా వుంది. చిరంజీవి నటిస్తున్న స్ట్రెయిట్ మూవీ ఇది. బాబీ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్ రాజా రవితేజ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







