‘కాంతార’ వివాదం: టేక్ లైట్.! ఇప్పుడేం చేయలేరురా.!

- October 25, 2022 , by Maagulf
‘కాంతార’ వివాదం: టేక్ లైట్.! ఇప్పుడేం చేయలేరురా.!

కన్నడ మూవీ ‘కాంతారా’ ఈ మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చి, ఏ స్థాయిలో విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన సినిమా ఇది.
విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కంటెంట్ వున్నోడికి కటౌట్‌తో పని లేదు అని నిరూపించింది. హీరో రిషబ్ శెట్టిని చూసి ఈ సినిమాకి జనం ఆకర్షితులు కాలేదు. కేవలం కంటెంట్ బాగుందన్న మౌత్ టాక్‌తోనే ఈ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
మంచి రివ్యూలు ఇచ్చారు క్రిటిక్స్ ఈ సినిమాకి. దాంతో, ఎలాంటి నెగటివిటీ అడ్డు పుల్లలు వేయలేకపోయింది. సినిమా మంచి వసూళ్ల రాబట్టింది. దసరా సీజన్‌ని సంతృప్తికరంగా యూజ్ చేసుకుంది ఈ సినిమా. ఆల్రెడీ కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాని తెలుగుతో పాటూ వివిధ భాషల్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
విడుదలైన అన్ని భాషల్లోనూ ‘కాంతారా’కు మంచి ఆదరణ దక్కింది. ఇదిలా వుంటే, తాజాగా ఓ వివాదం ‘కాంతారా’ను చుట్టుముట్టింది. ఈ సినిమాలోని ఓ పాటను కాపీ కొట్టేశారంటూ ఓ మలయాళ మ్యూజిక్ బ్యాండ్ రచ్చకెక్కింది. నిజానికి ఈ మధ్య అన్ని సినిమాల విషయంలోనూ ఇలాంటి నెగిటివిటీ టాక్స్ ముందే వచ్చి సినిమా రిజల్ట్‌ని దెబ్బ తీస్తున్న సంగతి తెలిసిందే. 
అయితే, ‘కాంతారా’ రిలీజై చాలా రోజులే అయ్యింది. రావల్సిన సక్సెస్ వచ్చేసింది. వసూళ్ల పరంగానూ బోలెడంత లాభాలే దక్కించుకుంది. ఈ టైమ్‌లో ఈ వివాదం ‘కాంతారా’ను ఏం చేయగలదు చెప్పండి. టేక్ లైట్ బాస్.! 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com