రవితేజ దీవాళి డబుల్ ధమాకా.! తర్వాత ఏం చేస్తాడో.!

- October 25, 2022 , by Maagulf
రవితేజ దీవాళి డబుల్ ధమాకా.! తర్వాత ఏం చేస్తాడో.!

మాస్ రాజా రవితేజ దీపావళికి డబుల్ ధమాకా ఇచ్చాడు. ఆయన నటిస్తున్న రెండు సినిమాల నుంచి అప్‌డేట్స్ ఇచ్చి, ఫ్యాన్స్‌లో వుత్సాహం నింపాడు. 
మాస్ రాజా నటిస్తున్న తాజా చిత్రాలు ‘రావణాసుర’ మరియు, ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ రెండు సినిమాల నుంచీ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేసి దీపావళికి స్పెషల్ విషెస్ చెప్పాడు ఫ్యాన్స్‌కి రవితేజ.
రెండు లుక్స్‌లోనూ రవితేజ చాలా ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాడు. కానీ, రిలీజ్ తర్వాత ఏం చేస్తాడనేదే ఫ్యాన్స్‌లో నెలకొన్ని డౌటానుమానం.
ఈ మధ్య రవితేజ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోర్లా కొడుతున్న సంగతి తెలిసిందే. దాంతో, ఈ సినిమాలైనా రవితేజకి ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో అని ఫ్యాన్స్ పెద్దగా అంచనాలు పెట్టుకోవడం లేదు.
కానీ, మాస్ రాజా మారిపోయాడంటున్నారు. వరుసగా తగిలిన దెబ్బలతో ప్రమోషన్స్ నుంచి, సినిమా మేకింగ్ విషయంలోనూ కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాడనీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారమ్. 
చూడాలి మరి, ఈ సారైనా రవితేజ ఏం చేస్తాడో. అన్నట్లు సోలో హీరోతో పాటూ, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేర్ వీరయ్య’లో రవితేజ గెస్ట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com