ఎయిర్ టెల్ వాటా విక్రయం!
- April 20, 2016
బారతీ ఎయిర్‌టెల్ కంపెనీ తన టవర్ల విభాగమైన భారతీ ఇన్ ఫ్రాటెల్‌లో 5 శాతం వాటాను విక్రయించాలని యోచిస్తోంది. బహిరంగ మార్కెట్ లావాదేవీల ద్వారా ఈ వాటా విక్రయంతో రూ.3,500 కోట్ల నుంచి రూ.4,000 కోట్లు సమీకరించాలని భారతీ ఎయిర్‌టెల్ యోచిస్తోందని సమాచారం. ఇన్‌ఫ్రాటెల్‌లో ఎయిర్‌టెల్‌కు 71.7 శాతం వాటా ఉంది. ఈ వాటా విక్రయం ద్వారా వచ్చిన నిధులతో రుణ భారాన్ని తగ్గించుకోవాలని భారతీ ఎయిర్‌టెల్ భావిస్తోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ వాటా విక్రయ వార్తలపై వ్యాఖ్యానించడానికి కంపెనీ ప్రతినిధి నిరాకరించారు. కాగా గత ఏడాది డిసెంబర్ నాటికి ఎయిర్‌టెల్ నికర రుణభారం రూ.78,816 కోట్లుగా ఉంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ రంగంలోకి వస్తుండటంతో ఎయిర్‌టెల్ 4జీ సేవలను విస్తృతం చేస్తోంది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







