ఒమన్‌లో ధూమపానానికి కొత్త నిబంధనలు
- October 27, 2022
మస్కట్: ప్రజారోగ్యం, మెరుగైన పర్యావరణాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలలో భాగంగా మస్కట్ మునిసిపాలిటీ అనేక చర్యలను చేపట్టింది. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానంపై నిషేధిస్తూ తాజా ఆర్డర్ జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. బస్సులు, టాక్సీలు, విమానాలు, ఓడలు, పడవలు వంటి ప్రజా రవాణా వ్యవస్థలో ధూమపానాన్ని నిషేధించారు. స్మోకింగ్ జోన్‌లకు అనేక షరతులను విధించారు. ధూమపానం చేసేవారి కోసం నిర్దేశించిన స్థలం ఆమోదం కోసం, మున్సిపల్ ఆరోగ్య వ్యవహారాల విభాగం నుండి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఈ స్థలాలు తప్పనిసరిగా భద్రత, అగ్ని-నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని నిర్దేశించింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులను ధూమపానం ప్రదేశాలలోకి అనుమతించకూడదు. ప్రార్థనా గృహాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ సంస్థలు, ఆరోగ్య-క్రీడా సౌకర్యాలలో కూడా ధూమపానాన్ని నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఒమన్ శిక్షాస్మృతి ప్రకారం.. మొదటి - రెండవ ఉల్లంఘనకు OMR100 జరిమానా, గరిష్టంగా మూడు నెలల జైలు శిక్ష లేదా రెండు శిక్షలను ఏకకాలంలో విధించబడుతుంది. రెండవ ఉల్లంఘన తర్వాత ప్రతి తదుపరి ఉల్లంఘనకు OMR300 చొప్పున జరిమానా విధించబడుతుందని మునిసిపాలిటీ తెలిపింది. మునిసిపాలిటీ ద్వారా లైసెన్స్ పొందిన అవుట్‌లెట్లు నిబంధనలు ఉల్లంఘించినట్లయితే మొదటిసారి మూడు రోజులకు మించకుండా.. రెండవసారి ఏడు రోజులకు మించకుండా మూసివేత ఉత్తర్వులు జారీ చేస్తారు.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్‌మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









