ఖతార్‌లో ప్రవేశానికి యాంటిజెన్, PCR పరీక్షలు రద్దు
- October 27, 2022
దోహా: ఖతార్‌లోని పౌరులు, నివాసితులు ఇకపై ఖతార్‌కు చేరుకున్న తర్వాత 24 గంటలలోపు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లేదా PCR పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సందర్శకులు ఇకపై ఖతార్‌కు ప్రయాణించే ముందు కొవిడ్-19 పీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ఫలితాన్ని చూపెట్టాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH) వెల్లడించింది. ఖతార్‌లో కొవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. అక్టోబరు 26 మంత్రి మండలి నిర్ణయం మేరకు కొవిడ్ ఆంక్షల్లో మార్పులు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మారిన నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, ఖతార్‌లోని ఆరోగ్య సంరక్షణ ఫెసిలిటీస్ లోకి ప్రవేశించేటప్పుడు ఎహెత్రాజ్(Ehteraz) అప్లికేషన్ ద్వారా ఆరోగ్య స్థితిని ప్రదర్శించడం తప్పనిసరి చేసింది. మరిన్ని నిబంధనల గురించి తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను చూడాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







