ఖతార్‌లో ప్రవేశానికి యాంటిజెన్, PCR పరీక్షలు రద్దు

- October 27, 2022 , by Maagulf
ఖతార్‌లో ప్రవేశానికి యాంటిజెన్, PCR పరీక్షలు రద్దు

దోహా: ఖతార్‌లోని పౌరులు, నివాసితులు ఇకపై ఖతార్‌కు చేరుకున్న తర్వాత 24 గంటలలోపు రాపిడ్ యాంటిజెన్ టెస్ట్ లేదా PCR పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలాగే సందర్శకులు ఇకపై ఖతార్‌కు ప్రయాణించే ముందు కొవిడ్-19 పీసీఆర్ లేదా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్ష ఫలితాన్ని చూపెట్టాల్సిన అవసరం లేదని ప్రజారోగ్య మంత్రిత్వ శాఖ (MOPH) వెల్లడించింది. ఖతార్‌లో కొవిడ్-19 కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. అక్టోబరు 26 మంత్రి మండలి నిర్ణయం మేరకు కొవిడ్ ఆంక్షల్లో మార్పులు చేసినట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మారిన నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. అయితే, ఖతార్‌లోని ఆరోగ్య సంరక్షణ ఫెసిలిటీస్ లోకి ప్రవేశించేటప్పుడు ఎహెత్రాజ్(Ehteraz) అప్లికేషన్ ద్వారా ఆరోగ్య స్థితిని ప్రదర్శించడం తప్పనిసరి చేసింది. మరిన్ని నిబంధనల గురించి తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌ను చూడాలని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com