కువైట్ను విడిచిపెట్టిన 382,000 మంది ప్రవాసులు
- October 27, 2022
కువైట్: 2022 ప్రథమార్ధంలో కువైట్ జనాభా 1.8% పెరిగి 4.46 మిలియన్లకు చేరుకున్నప్పటికీ.. జనాభా ఇప్పటికీ కోవిడ్కు ముందు స్థాయి కంటే తక్కువగా ఉందని, అలాగే ప్రవాసుల సంఖ్య 11.4% తగ్గిందని నేషనల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ తన తాజా ఆర్థిక పరిశోధన నివేదికలో పేర్కొంది. 2022 మొదటి అర్ధ భాగంలో వచ్చేవారి సంఖ్య 2.3% పెరిగినప్పటికీ.. ప్రవాస జనాభా వార్షిక ప్రాతిపదికన 382,000 భారీ తగ్గుదల నమోదైంది. ప్రవాసులలో భారతీయులు 15% అంటే 153000 మంది, ఈజిప్షియన్లు (-9%) అంటే 58,000 మంది 2021లో అత్యధికంగా తగ్గిన వారి జాబితాలో టాప్ లో ఉన్నారు. దీంతో మొత్తం జనాభాలో భారతీయుల వాటా 2019లో 22% నుండి 19%కి పడిపోయింది. ఈజిప్షియన్ల వాటా కువైట్ మొత్తం జనాభాలో 15% నుండి 14%కి పడిపోయిందని నివేదిక పేర్కొంది. ప్రైవేట్ రంగంలో కువైట్ పౌరులకు ఉద్యోగావకాశాలు పెరగడం వల్ల గత సంవత్సరంలో కువైట్ పౌరుల ఉపాధి రేట్లు(6.1%) గణనీయంగా పెరిగాయి. అయితే, జూన్ 2022లో మొత్తం ఉపాధి (గృహ కార్మికులు మినహా) 5.9% పడిపోయింది. ఇది కువైటేతర ఉద్యోగాలు తగ్గడం వల్ల అధికంగా నమోదైందని నివేదిక పేర్కొంది. 2019 నుండి ప్రవాస జనాభా తగ్గినప్పటికీ.. ప్రవాస జనాభాలో గృహ కార్మికుల వాటా 2017లో 20% నుండి 23.6%కి పెరిగింది. నిర్మాణ, ప్రైవేట్ గృహ కార్మికులు, రిటైల్, తయారీ వంటి రంగాలు క్షీణతకు దారితీయడంతో.. తక్కువ-స్థాయి ఉద్యోగాల సంఖ్య బాగా పడిపోయిందని నివేదిక పేర్కొంది.
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







