ఒమన్‌ టూరిస్టులపై థాయిలండ్‌ టూరిజం అంచనాలు

- April 21, 2016 , by Maagulf
ఒమన్‌ టూరిస్టులపై థాయిలండ్‌ టూరిజం అంచనాలు


టూరిజం అథారిటీ ఆఫ్‌ థాయిలాండ్‌ (టిఎటి) దుబాయ్‌ మరియు మిడిల్‌ ఈస్ట్‌ కార్యాలయం మంగళవారం ఓ రోడ్‌ షోను గ్రాండ్‌ హయాత్‌ మస్కట్‌ నుంచి ప్రారంభించింది. థాయిలాండ్‌ టూరిజంని ప్రమోట్‌ చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సిటీలోని ప్రముఖ ట్రావెల్‌ ఏజెంట్స్‌తో ఈ సందర్భంగా మీటింగ్‌ ఏర్పాటు చేశారు. టిఎటి మిడిల్‌ ఈస్ట్‌ ఆఫీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టేన్స్‌ పెట్సువాన్‌ ఈ మీటింగ్‌కి నాయకత్వం వహించారు. 2015లో 29.8 మిలియన్ల పర్యాటకులు వచ్చారనీ, ఇది 20 శాతం పెరుగుదల అని, మిడిల్‌ ఈస్ట్‌ నుంచి 12.87 శాతం పెరుగుదల నమోదయ్యిందనీ, 90,000 మంది టూరిస్టులు ఒమన్‌ నుంచి థాయిలాండ్‌ పర్యటనకు వచ్చారని చెప్పారు. ఈ ఏడాది ఒమన్‌ నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 100,00 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారాయన. థాయ్‌లాండ్‌లో ముస్లిం ఫ్రెండ్లీ ఎకామడేషన్స్‌ కారణంగా పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారని ఆయన చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com