యూఏఈ వెదర్ అప్డేట్: నవంబర్‌లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం
- November 04, 2022
యూఏఈ: నవంబర్ నెలలో పగటిపూట ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియరాలజీ (NCM) చల్లని విషయం తెలిపింది. సగటు ఉష్ణోగ్రతలు అక్టోబర్‌లో ఉన్నదానికంటే నవంబర్ నెలలో 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్ తరకు తగ్గుతాయని పేర్కొంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాలు, కొన్ని లోతట్టు ప్రాంతాలలో రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది. నవంబర్‌లో గాలులు ఉదయం సమయంలో ఆగ్నేయ దిశగా.. పగటిపూట వాయువ్యం దిశగా వీస్తాయని వాతావరణ శాఖ వివరించింది. దీని కారణంగా కొన్ని ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు. నవంబర్ నెలకు సంబంధించి సగటు ఉష్ణోగ్రత 24 - 25 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుందని తెలిపింది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రత 29 - 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. అయితే సగటు కనిష్ఠ ఉష్ణోగ్రత 19 - 21 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. 2021లో స్వీహాన్‌లో అత్యధికంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. 2009లో జెబెల్ జైస్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 4.1 డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- $1 మిలియన్ గెలిచిన భారతీయ ప్రవాసుడు..!!
- వైరల్ స్టంట్స్.. డ్రైవర్ అరెస్టు..వెహికిల్ సీజ్..!!
- కువైట్ లో మార్చి 15 నుండి క్యాంపింగ్ సీజన్ ప్రారంభం..!!
- 100 మిలియన్లు దాటిన బస్సు ప్రయాణికుల సంఖ్య..!!
- ఖతార్లో ఐదు రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి..!!
- ఫేక్ కరెన్సీ..ఇద్దరు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- విశాఖలో పలు ప్రొజెక్టులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- డిసెంబర్ 6న దేశంలో పలు చోట్ల పేలుళ్లకు ప్లాన్
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్







