ఖతార్ మన్సౌరా గోడలపై ఇండియన్ ట్రక్ ఆర్ట్ చిత్రాలు
- November 06, 2022
దోహా: జెడారీఆర్ట్లో భాగంగా దోహా అల్ మన్సౌరా మెట్రో స్టేషన్ వెలుపల ప్రసిద్ధ ఇండియన్ ట్రక్ ఆర్ట్ చిత్రాలను చిత్రించారు. ఇవి ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. రంగు రంగుల పువ్వులు, కాలిగ్రఫీ కలిగి ఉన్న ఈ చిత్రాలు ఆసియా దేశాలలో ట్రక్కులు, బస్సులపై ఎక్కువగా కనిపిస్తాయి. మన్సౌరాలోన ట్రక్ ఆర్ట్ మ్యూరల్ ఆల్ ఇండియా పర్మిట్ చిత్రాన్ని ప్రముఖ చిత్రకారులు అఖ్లాక్ అహ్మద్ అకా షబ్బు,ఫరీద్ బావా చిత్రించారు. భారత బృందం ఏడు భాషలలో (హిందీ, ఇంగ్లీష్, బంగ్లా, పంజాబీ, అరబిక్, ఉర్దూ) నినాదాలను రాసింది. ఖతార్ మ్యూజియం ఈ ఆసియా సంప్రదాయ కళారూపాలను దోహా వీధుల్లోకి తీసుకురావడానికి సహకారాన్ని అందిస్తుంది. ఖతార్ మ్యూజియమ్స్లోని పబ్లిక్ ఆర్ట్ డైరెక్టర్ అబ్దుల్రహ్మాన్ అహ్మద్ అల్ ఇషాక్ మాట్లాడుతూ... జెడారీ ఆర్ట్ అనేది ఒక పబ్లిక్ ఆర్ట్ ప్రోగ్రామ్ అని, దోహా నగరం అంతటా కొత్త పర్యాటక ఆకర్షణలను సృష్టించడం లక్ష్యంగా ఈ ప్రోగ్రామ్ చేపట్టినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!
- జర్మన్ విదేశాంగ మంత్రితో GCC దేశాల మినిస్టర్స్ భేటీ..!!
- ఇరాన్ సైనిక అటాచీలను బహిష్కరించిన సౌదీ అరేబియా..!!









