జింబాబ్వే పై 71 పరుగులతో టీమిండియా ఘన విజయం
- November 06, 2022
ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచులో జింబాబ్వేపై టీమిండియా 71 పరుగులు తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. ఓపెనర్ కేఎల్ రాహుల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ అర్ధ సెంచరీలు బాదారు.
కేఎల్ రాహుల్ 51, కెప్టెన్ రోహిత్ శర్మ 15, విరాట్ కోహ్లీ 26, సూర్యకుమార్ యాదవ్ 61 (నాటౌట్) , రిషబ్ పంత్ 3, హార్దిక్ పాండ్యా 18, అక్షర్ పటేల్ 0 (నాటౌట్) పరుగులు చేశారు. 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో జింబాబ్వే ముందు నుంచీ తడబడింది. సికందర్ రజా 34, రియాన్ బర్ల్ 35 మినహా మిగతా జింబాబ్వే బ్యాట్స్ మెన్ ఎవరూ రాణించలేకపోయారు.
దీంతో 17.2 ఓవర్లలో 115 పరుగులకు జింబాబ్వే ఆలౌట్ అయింది. టీమిండియా బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ 3, షమీ, హార్దిక్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ కు ఒక్కో వికెట్ దక్కాయి. అంతకు ముందు జింబాబ్వే బౌలర్లలో సీన్ విలియమ్స్ 2, బ్లెస్సింగ్ ముజారబానీ, సింకదర్ రజా చెరో వికెట్ తీశారు. టీమిండియా ఇప్పటికే సెమీఫైనల్స్ కు చేరింది.
తాజా వార్తలు
- వాట్సాప్‌కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్‌లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









