మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం
- November 06, 2022
తెలంగాణ: భారత్ మొత్తం ఉత్కంఠ రేపిన మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై 11 ,666 ఓట్ల తేడాతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి నువ్వా నేనా అన్నట్లు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య నడిచింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన కారు పార్టీ..11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది. రెండు, మూడు, 15వ రౌండ్లలో మాత్రమే కమలం పార్టీ ముందంజలో నిలిచింది. మిగతా అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది. ఫలితంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీ విక్టరీ కొట్టింది.
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టారు ఆ నియోజకవర్గ ప్రజలు. అన్ని మండలాల్లోనూ కారు దూసుకెళ్లింది. అయితే గట్టుప్పల్ ప్రజలు ఆ ఉప్పలగట్టు వీరభద్ర స్వామి సాక్షిగా టీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపారు. గట్టుప్పల్ మండల పరిధిలోని మెజార్టీ ఓట్లు టీఆర్ఎస్కే పడ్డాయి. నేతన్నల ఓట్లన్నీ గంపగుత్తగా కారు గుర్తుకు పడ్డాయి. చేనేతకు మరణ శాసనం రాసిన మోదీకి నేతన్నలు గట్టిగా సమాధానం చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







