మౌంట్ ఎవరెస్ట్‌పైకి యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్
- April 22, 2016
యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ మిలిటరీ టీమ్, ఖాట్మండూ చేరుకున్నాయి. నేపాల్ రాజధాని ఖాట్మండు నుంచి మౌంట్ ఎవరెస్ట్‌పైకి వెళ్ళేందుకు ఈ టీమ్ ప్రయత్నించనుంది. టీమ్‌లో మొత్తం 16 మంది ఉంటారు. ఇందులో 13 మిలిటరీలో వివిధ ర్యాంకులకు చెందినవారు. అందులో ఒకరు డాక్టర్, ముగ్గురు పర్వతారోహణలో నైపుణ్యం సాధించినవారు. ప్రపంచంలోనే అతి ఎత్తయిన శిఖరంగా పేరొందిన మౌంట్ ఎవరెస్ట్‌ని అధిరోహించడం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఈ టీమ్. రెండు నెలల్లో శిఖరాన్ని చేరుకోవాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్వతారోహణలో భాగంగా ఈ టీమ్ అనేకరకాలైన సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. ముఖ్యంగా మంచు పర్వతాల్ని అధిరోహించేటప్పుడు ఆక్సిజన్ సరైన రీతిలో అందదు. అన్ని విధాలా శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ టీమ్ పర్వతారోహణకు సిద్ధమయ్యింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







