రియాద్‌లో ఒబామాని కలిసిన మొహమ్మద్
- April 22, 2016
క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబీ మరియు డిప్యూటీ సుప్రీం కమాండర్ ఆఫ్ ది యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, రియాద్‌లో అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాని రిసీవ్ చేసుకున్నారు. ఇరు దేశాల మధ్య సహాయ సహకారాలపై ఇరువురు నాయకులూ చర్చించారు. గురువారం జరిగే జిసిసి - అమెరికా సమావేశంలో పాల్గొనేందుకు సౌదీ అరేబియా వచ్చారు ఒబామా. ఇరు దేశాలకు సంబంధించిన విషయాలతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాలపైనా ఇరు దేశాల నేతల మధ్యా చర్చలు జరిగాయి. తీవ్రవాదం, హింస వంటి అంశాల గురించి షేక్ మొహమ్మద్, ఒబామా వద్ద ప్రస్తావించారు. అంతర్జాతీయ స్థాయిలో తీవ్రవాదం పెను ప్రమాదంగా మారిందని షేక్ మొహమ్మద్, ఒబామా దృష్టికి తీసుకువచ్చారు. తీవ్రవాదాన్ని తుదముట్టించే క్రమంలో ప్రపంచ దేశాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని షేక్ మొహమ్మద్, ఒబామా అభిప్రాయపడ్డారు.
తాజా వార్తలు
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్







