దుబాయ్ రియల్ హీరోస్
- April 22, 2016
వైఎస్ ప్రెసిడెంట్ మరియు యూఏఈ ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, దుబాయ్ ప్రభుత్వం ఎంపిక చేసిన ఎక్స్‌లెన్స్ ప్రోగ్రామ్ అవార్డ్ విజేతలతో కలిసి దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద గ్రూప్ ఫొటోకి పోజులిచ్చారు. వివిధ రంగాల్లో ఆయా వ్యక్తులు చూపిన ప్రతిభ ఆధారంగా ఈ అవార్డుల్ని ప్రకటించారు. 'అన్‌సంగ్ హీరోస్' పేరుతో పలువురు ఉద్యోగులకు ఈ అవార్డులు దక్కాయి. దేవా, దుబాయ్ మునిసిపాలిటీ, దుబాయ్ కల్చర్, దుబాయ్ కస్టమ్స్, మొహమ్మద్ బిన్ రషీద్ హౌసింగ్ ఎస్టాబ్లిష్‌మెంట్, దుబాయ్ పోలీస్, దుబాయ్ కార్పొరేషన్ ఫర్ అంబులెన్స్ సర్వీసెస్, జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ మరియు ఫారినర్స్ ఎఫైర్స్ ఇన్ దుబాయ్, మరియు దుబాయ్ కోర్ట్స్‌కి చెందిన ఉద్యోగులు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. రషీద్ ఆసుపత్రిలో సేవలకుగాను హస్సన్ జాఫర్ మొహమ్మది అల్ జాదా ఈ అవార్డును అందుకున్నారు. అవార్డులు అందుకున్న మరికొందరిలో అహ్మద్ యూసుఫ్ హస్సన్ మురాద్ (దుబాయ్ మునిసిపాలిటీ ప్రిన్సిపల్ లేబర్ ఎక్విప్‌మెంట్ ఆపరేటర్ - ఎమిరేటి), గులాం మొహమ్మద్ గులామ్ దస్తగిర్ (దుబాయ్ కస్టమ్స్, ఆఫీస్ సూపర్‌వైజర్ - ఇండియన్), సుకైనా అజిజ్ అబ్దుల్ రహమాన్ కరమ్ (దుబాయ్ పోలీస్ ప్రాసిక్యూషన్ ఎంట్రీ ఆపరేటర్ - ఎమిరేటి) ఉన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







