పొడి దగ్గుకు నివారణ

- June 17, 2015 , by Maagulf
పొడి దగ్గుకు నివారణ

సీజన్ మారే కొద్ది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా డ్రై సీజన్ లో శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చల్లని వాతావరణంలో కొన్ని అలర్జీల వల్ల కూడా డ్రై కఫ్ (పొడి దగ్గుకు) కారణం అవుతుంది. ముఖ్యంగా డ్రై సమ్మర్ ఎయిర్ వల్ల కూడా డ్రై కఫ్ తో ఎక్కువ మంది బాధపడుతుంటారు. వెైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, పరాన్న జీవుల వలన కలిగిన ఇన్ఫెక్షన్ మొదట పొడి దగ్గుతోనే ఆరంభమై బాధిస్తుంటుంది. గొంతు, ముక్కులో ప్రారంభమైన ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల వరకూ ప్రయాణించి, శ్వాస మార్గాల లోపల ఉండే 'మ్యూకోసా'పొరను దెబ్బ తిస్తాయి. ఫలితంగా పొడిదగ్గు మొదలెై సతాయిస్తుంది. సాధారణంగా ఏ దగ్గు అయినా, వారం రోజులలో తగ్గాలి. వారం దాటినా పొడి దగ్గు వేధిస్తుంటే మాత్రం ప్రమాదకరమైన సమస్య ఉన్నదని భావించి జాగ్రత్తపడాలి, దగ్గుతోపాటు జ్వరం, తలనొప్పి, ఆయాసం ఉంటే రక్తపరీక్ష, ఊపిరితిత్తుల ఎక్స్రే, శ్వాసకోశాల పరీక్ష చేయించుకోవాలి. చలికాలంలో దగ్గుకు తక్షన ఉపశమనం కలిగించే హోం రెమెడీస్ ఇంకా, కొన్ని రకాల హానికరమైన కెమికల్స్ వల్ల దగ్గుకు కారణం అవుతుంది. పొడి దగ్గను తగ్గించుకోవడాని వివిధ రకాలుగా ప్రయత్నిస్తుంటారు . అయితే ఎలాంటి మార్పు కనిపించదు. మిమ్మల్నివేధించే పొడి దగ్గుకు 8 బెస్ట్ హోం రెమడీస్ కొంత మంది నిపుణుల ప్రకారం పొడి దగ్గు ఎక్కువగా సమ్మర్ సీజన్ లో వస్తుంది. స్విమ్మింగ్ తర్వాత ఇంటికి చేరుకొన్నా, చేతులను సరిగా శుభ్రం చేసుకోకపోతే ఇన్ఫెక్షన్ వల్ల క్రిములను వ్యాపింపచేస్తుంది. మరియు మీరు తీసుకొనే పానీయాలు ఇతరులతో షేర్ చేకోకపోవడం మంచిది . అయితే డ్రై కఫ్(పొడి దగ్గకు) గల కారణాలు ఏంటో ఈ క్రింది లిస్ట్ ద్వారా తెలుసుకుందాం.... అలర్జీల వల్ల దగ్గు, తుమ్ముల మరియు నాజల్ బ్లాకేజ్(ముక్కు మూసుకుపోవడం) జరుగుతుంది. ముఖ్యంగా వేసవి సీజన్ లో వాతావరణంలో గాలి మరీ పొడిగా ఉండటం వల్ల మీరు ఇది వరకే డ్రైకఫ్ తో బాధపడుతున్నట్లైతే అందుకు ప్రధాణ కారణం పోలెన్ అలర్జీ. వేసవి సీజన్ వాతావరణ కాలుష్యం పొడిదగ్గకు కారణం అవుతుందని ఏఒక్కరూ గ్రహించరు. ట్రాఫిల్ లో ద్విచక్ర వాహనంలో ప్రయాణం చేసేప్పుడు వాతావరణంలో చేరే కాలుష్యం వల్ల డ్రై కఫ్ కు కారణం అవుతుంది. కాబట్టి, మాస్క్ లేదా హెల్మెట్ ను ధరించాలి. పొడి దగ్గుతో బాధపడే వారు ఆల్కహాలిక్ సమ్మర్ డ్రింక్ కు దూరంగా ఉండాలి . ఇది అసిడిక్ రిఫ్లెక్షన్ మరియు పొడి దగ్గకు కారణం అవుతుంది. దాహం వేసినప్పుడు మంచినీరు తగినన్ని తీసుకుంటుండాలి. వేసవి సీజన్ లో బయట తిరిగి ఇంటికి రాగానే చేతులను శుభ్రంగా వాష్ చేసుకోవాలి. జలుబు కూడా సమ్మర్ డ్రై కఫ్ కు కారణం అవుతుంది . కాబట్టి మీఅంతట మీరు ఇన్ఫెక్షన్స్ కు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. మీరు ఇదివరికే సైనసైటిస్ తో బాధపడుతున్నట్లైతే, వేసవిలో సైనసైటిస్ తో పాటు, తలనొప్పి, డ్రై కఫ్ ఎక్కువ అవుతుంది. వీటికోసం సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అప్పటికీ తగ్గకపోతే మీ ఫిజీషియన్ ను కలవండి.. వేసవి సీజన్ లో ఆస్తమాతో బాధపడే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వాతావరణ కాలుష్యం వల్ల ఆస్తమా మరింత పెరిగే అవకాశం ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com