29న హైదరాబాద్ కు వెళ్లనున్న రాష్ట్రపతి

- June 17, 2015 , by Maagulf
29న హైదరాబాద్ కు వెళ్లనున్న రాష్ట్రపతి

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెలాఖరుకు హైదరాబాద్ రానున్నారు. ఈ నెల 29 నుంచి జులై 8వ తేదీ వరకూ ఆయన నగరంలో విడిది చేయనున్నారు. దాంతో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం ప్రణబ్ వర్షాకాల విడిది కోసం ముస్తాబు అవుతోంది. కాగా గత ఏడాది శీతాకాల విడిది కోసం ప్రణబ్ డిసెంబర్ లోనే రావాల్సి ఉంది. అయితే ఆసమయంలో గుండె సంబంధిత ఇబ్బందులతో ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్న ప్రణబ్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దాంతో శీతాకాలం విడిదికి బదులుగా రాష్ట్రపతి వర్షాకాలం విడిదికి వస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com