మాదక ద్రవ్యాల స్మగ్లింగ్.. ఆసియన్‌కు ఐదేళ్ల జైలుశిక్ష
- November 14, 2022
బహ్రెయిన్: 152 మెథాంఫేటమిన్ క్యాప్సూల్స్‌ను కడుపులో దాచుకొని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించినందుకు గాను ఒక ఆసియా వ్యక్తికి హై క్రిమినల్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. BD3,000 జరిమానాతో పాటు అతడు శిక్షను అనుభవించిన తర్వాత అతనిని శాశ్వత బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది. నిందితుడు తన స్వదేశం నుండి బహ్రెయిన్ రాజ్యానికి వచ్చాడు. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అతను అనుమానాస్పదంగా కనిపించడంతో కస్టమ్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని విచారించారు. అతడి కడుపులో డ్రగ్స్ ఉన్నట్లు అనుమానం రావడంతో కస్టమ్స్ అధికారి ఎక్స్‌రే గదికి తరలించాలని ఆదేశించారు. దీంతో సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌కు అతడిని తరలించి పరిశీలించారు. అతడి కడుపులో నార్కోటిక్ క్యాప్సూల్స్ ఉన్నాయని గుర్తించారు. ఆ క్యాప్సూల్స్‌లో నిషేధిత మాదకద్రవ్యం మెథాంఫేటమిన్ ఉన్నట్లు ల్యాబ్‌లో నిర్ధారించారు. BD1,000 కోసం బహ్రెయిన్‌కు మాదకద్రవ్యాలను స్మగ్లింగ్ చేసేందుకు ఒప్పుకున్నట్లు నిందితుడు విచారణలో అంగీకరించాడని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్‌సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









