పాకిస్థాన్‌లో ప్రావిన్స్‌కు చెందిన ఓ మంత్రి దారుణ హత్య..
- April 23, 2016
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన ఓ మంత్రిపై గుర్తుతెలియని దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ అసెంబ్లీలో సర్దార్ సోరన్ సింగ్ మైనారిటీ సంక్షేమశాఖ మంత్రిగా ఉన్నారు. సర్దార్ శుక్రవారం తన కారులో వెళ్తుండగా.. బునేర్ జిల్లాలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మంత్రి కారును అడ్డుకున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే.. దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సర్దార్ అక్కడికక్కడే మృతి చెందారు. సర్దార్ హత్యకు గురైనట్లు ప్రావిన్స్ సమాచార మంత్రి ముస్తాఖ్ ఘని ధ్రువీకరించారు. కాల్పులకు బాధ్యత వహిస్తూ.. ఇంతవరకు ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయలేదు. అయితే తాలిబన్ ఉగ్రవాదులే ఈ ఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







