8 మెడికల్ కాలేజీలను ప్రారంభించిన సిఎం కెసిఆర్
- November 15, 2022
హైదరాబాద్: రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి వర్చువల్ గా ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 8 కాలేజీల్లో ఈ ఏడాది నుంచే క్లాసులు ప్రారంభమవుతాయని చెప్పారు. కొత్త మెడికల్‌కాలేజీలు రావడానికి రాష్ట్ర వైద్యశాఖ చాలా కృషి చేసిందని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ రావాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని, అందులో భాగంగానే ప్రతి జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 8 కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో 1150 సీట్లు అందుబాటులోకి వచ్చాయన్నారు. గతంలో 850 సీట్లు మాత్రమే ఉండేవని.. ఇప్పుడు 2,790 సీట్లు ఉన్నాయని చెప్పారు.
‘తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇవాళ సువర్ణధ్యాయం. మర్చిపోలేని రోజు. ఒకే రోజు 8 మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడం గర్వకారణం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మరో 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని, అందుకోసం రాష్ట్ర వైద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో చాలామంది విద్యార్థులకు అవకాశాలు రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో కంటే మెడికల్, పీజీ, సూపర్ స్పెషాలిటీ సీట్లను గణనీయంగా పెంచామన్నారు. సీట్ల పెరుగుదలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల విద్యార్థులకు అపారమైన అవకాశాలు లభిస్తాయని చెప్పారు.
నూతన మెడికల్ కాలేజీలను తరచూ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావు తోపాటు ఆ శాఖ అధికారులు కూడా సందర్శిచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నూతన మెడికల్ కాలేజీల్లో అన్ని సౌకర్యాలు ఉండాలని, ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు అభివృద్ది చెందాలన్నారు. పలు జిల్లాల్లో పెండింగ్ లో ఉన్న నూతన భవన నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని కోరారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







