జి20 దేశాల సదస్సులో బైడెన్, మోడీల సంభాషణ
- November 15, 2022
బాలి: జి20 దేశాల సదస్సు కోసం మన దేశం తరఫున ప్రధాని మోడీ ఇండోనేషియా వెళ్లిన విషయం తెలిసిందే. మంగళవారం ప్రారంభమైన ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను కలుసుకున్నారు. ఈ వేదికపై కలుసుకున్న మోడీ, బైడెన్ లో సరదాగా నవ్వుతూ కనిపించారు. మోదీ చెప్పేది వింటూ బైడెన్ సరదాగా నవ్వుతున్న వీడియోను ప్రధాని మోదీ కార్యాలయం ట్వీట్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది.
ఆ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రన్ ను మోడీ కలుసుకున్నారు. మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన మాక్రన్ కు మోడీ అభినందనలు తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధ ప్రస్తావనతో మొదలు.. రెండు రోజుల పాటు జరగనున్న జి20 దేశాల సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ప్రారంభోత్సవ ఉపన్యాసంలో ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని ప్రస్తావిస్తూ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఈ సమావేశాలను ప్రారంభించారు. ప్రపంచంపట్ల బాధ్యతగా ఫీలయితే వెంటనే యుద్ధానికి ముగింపు పలకాలని రెండు దేశాలను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు.
యుద్ధం ఆగకుంటే ప్రపంచం ముందుకు సాగడం కష్టమని, ఇది మరో ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీయొచ్చని జోకో విడోడో ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సులో వీటిపై చర్చ.. కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఆహార భద్రత, ఇంధన భద్రత, ఐరోపా సంక్షోభం, ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం తదితర అంశాలపైన జి20 దేశాలు చర్చించనున్నాయి. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లపైన విస్తృతంగా చర్చ జరుగనుంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు లీడర్లు మార్గాలు వెతకనున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







