ఒమాన్ లోని ప్రవాస శ్రామికులకు కనీస వేతనాలు?

- June 17, 2015 , by Maagulf
ఒమాన్ లోని ప్రవాస శ్రామికులకు కనీస వేతనాలు?


సుల్తానెట్ ఆఫ్ ఒమన్లో ప్రవాస శ్రామికులకు కూడా కనీస వేతనాలను చెల్లించేలా శ్రామిక చట్టాలను సవరించాలని, అక్కడి ప్రముఖ ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది.
2013 సం. నాటి డీక్రీ నం. 222 ప్రకారం, జులై 1 నుండి ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలలో పని చేసే అక్కడి పౌరుల కనీస వేతనం, 200 నుంచి 325  ఒమానీ రియల్స్ కు పెంచబడింది. కానీ వలస కార్మికుల గురించి ఏమీ స్పష్టం  చేయబడలేదు- అని జనరల్ ఫెడరేషన్ ఆఫ్ ఒమన్ ట్రేడ్ యూనియన్ (GFOTU) యొక్క బోర్డ్ మెంబరు మొహమ్మద్ అల్ ఖల్దీ చెప్పారు.
పరిణామాలు
    ఉద్యోగ నియామకం సందర్భంగా చెప్పిన వేతనం చెల్లింపబడనట్లైతే, మానవ వనరుల మంత్రిత్వశాఖ వారిని సంప్రదించాలని, అంతేకాని పైవిధమైన నిబంధనల వలన లేబర్ మార్కెట్ సంక్లిష్టమౌతుందని   మొహమ్మద్ అల్ ఖల్దీ అభిప్రాయపడ్డారు.ఒమన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మెంబర్ అహ్మద్ అల్ హూతి కూడా ఆ అభిప్రాయంతో ఏకీభవించారు.
కానీ మస్కట్ లోని సోషల్ వర్కార్ ఐన షాజీ సెబాస్టియన్ -"కొత్త కార్మిక చట్టం, ప్రవాస కార్మికులకుకుడా కనీస వేతనమిచినట్లైతే, ఒమన్ లేబర్ మార్కెట్లో అనేక సమస్యలను పరిష్కరించినట్లౌతుంది; ఒక గొప్ప ముందడుగౌతుంది.  చేసేది ఒకే పని ఐన ఎక్కువ-తక్కువలుగా వేతనాలను పొందుతున్న కార్మికులు న్యాయమైన సమాన వేతనాలను పొందగలుగుతారు. " అని తెలిపారు.

ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫరెన్సే (ITUC) సీనియర్ అధికారి ఒకరు స్థానిక, వలస శ్రామికులకు అందరికి సమాన ప్రతిఫలాలు, వేతనాలు చెల్ళింపబడే విధంగా కొత్త శ్రామిక చట్టం ఉంటుందని ఆశిస్తున్నామన్నారు.
ఇది ఇలా ఉండగా, వివిధ తరహాల భారతీయ శ్రామికులకు వారి వారి రాయబార కార్యాలయాలు సూచించిన ప్రకారం కనీస వేతనాలను చెల్లించని గల్ఫ్ దేశాల ఇమ్మిగ్రేషన్ క్లియరెన్సును తిరస్కరించాలని భారత్ ప్రభుత్వం యోచిస్తోంది.


--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com