ముంబై ఎయిర్ పోర్ట్ లో భారీగా మత్తు మందులు పట్టివేత
- June 17, 2015
ముంబై ఎయిర్ పోర్ట్ లో బుధవారం భారీ ఎత్తున మత్తు మందులను స్వాధీనం చేసుకున్నారు. దోహా మీదుగా దార్-ఇ-సలామ్ కు భారీ ఎత్తున మెథాక్విలోన్ అక్రమంగా తరలిస్తుండగా స్నిఫర్ డాగ్స్ పట్టేశాయి. 74 కేజీల మెథాక్విలోన్ ను తరలిస్తున్న టాంజానియా మహిళ చాంబో ఫాత్మా బాసిల్ ఎయిర్ ఇంటిలిజెన్స్ విభాగానికి చిక్కింది. ఈ డ్రగ్స్ విలువ 7.4 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా స్నిఫర్ డాగ్స్ మత్తు మందుల బ్యాగ్ ను గుర్తించాయని ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున మత్తుమందులను పట్టుకోవడం ఇదే మొదటిసారని కస్టమ్స్ ఎడిషనల్ కమిషనర్ మిలింద్ లాంజేవార్ తెలిపారు. తక్షణమే బాసిల్ ను అదుపులోకి తీసుకున్నామని తదుపరి విచారణ కొనసాగుతుందని తెలిపారు. గతంలో జింబాబ్వే మహిళ 13 కేజీలు ,ఇపుడు టాంజానియా మహిళ74 కేజీల అక్రమంగా రవాణా చేస్తున్న మత్తుమందులను పట్టుకోవడంలో కూడా తమ స్నిఫర్ డాగ్స్ టీమ్ ప్రముఖ పాత్ర వహించాయని అధికారులు వెల్లడించారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







