భారీ అగ్నిప్రమాదం చైనాలో.....
- April 23, 2016
చైనాలోని జియాంగ్షు ప్రావిన్స్ రసాయన కర్మాగారంలో నిన్న ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున ఎగిసిపడిన మంటలను అదుపు చేసేందుకు 600 మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. షాంఘై, నాన్జింగ్, నాన్‌టాంగ్, షుజో, వుక్సి నుంచి అగ్నిమాపక దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. రసాయనాలు నిల్వ ఉంచే ట్యాంకు దెబ్బతినడంతో అందులోని రసాయనాలు పరిసర ప్రాంతమంతా వ్యాపించి, మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారింది. ప్రమాదం కారణంగా ఆయిల్ పైప్‌లైన్‌ను నిలిపివేశారు. గిడ్డంగిలో 42 ట్యాంకులు ఉండగా.. వాటిలో రెండు దగ్ధమయ్యాయని, మరో ఐదు ట్యాంకులకు మంటలు అంటుకున్నాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఈ గిడ్డంగిలో 42 ట్యాంకులతో పాటు, 12 గాసోలిన్ ట్యాంకులు అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని వెల్లడి ంచారు. గతేడాది ఆగస్టులో టియాంజిన్ రసాయన కర్మాగారంలో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా 165 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!







