పుస్తక పఠనం పిల్లల హక్కు
- April 23, 2016
ప్రతి ఒక్కరికీ పుస్తకాలు అందించాలనీ, నేటి బాలలే రేపటి పౌరులు గనుక, వారికి విజ్ఞానం అందించేందుకు పుస్తకాలను వారికి చేరువ చేయాలని కలిమత్ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఎంపవర్‌మెంట్ అభిప్రాయపడింది. వరల్డ్ బుక్ డే సందర్భంగా పిల్లలకు పుస్తకాల్ని పంచిపెట్టే కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలిమత్ గ్రూప్ ఫౌండర్ మరియు సీఈఓ షకిరీ బోదౌర్ బింట్ సుల్తాన్ అల్ కాసిమి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమైంది. షార్జా ఎక్స్‌పో సెంటర్ వద్ద ఏప్రిల్ 30 నుంచి జరిగే 8వ షార్జా చిల్డ్రన్ రీడింగ్ ఫెస్టివల్ సందర్భంగా కొత్త ఫౌండేషన్‌ని ప్రారంభిస్తున్నట్లు షేకా బోదౌర్ చెప్పారు. పబ్లిక్ లైబ్రరీలు, రెఫ్యుజీ క్యాంపులు, అలాగే జనసాంద్రత ఎక్కువగ వఆఉండే ప్రాంతాల్లో తాము పుస్తకాలను పిల్లలకు అందుబాటులో ఉంచుతామని ఆమె వివరించారు. పిల్లల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచడమే కాకుండా, వారిని విజ్ఞాన వంతులుగా తీర్చిదిద్ది, సమాజానికి ఉపయోగపడేలా చేయాలన్న లక్ష్యంతోనే తమ సంస్థ పనిచేస్తుందని ఆమె వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







