24 క్రాటోమ్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్న కువైట్ కస్టమ్స్
- November 18, 2022
కువైట్: యూరోపియన్ దేశం నుంచి వస్తున్న మెయిల్లో ఉన్న 24 క్రాటోమ్ బాటిళ్లను విమానాశ్రయంలో స్వాధీనం చేసుకున్నట్లు కువైట్ కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. దేశానికి వచ్చే సరుకులపై మరింత శ్రద్ధ వహించనున్నట్లు కస్టమ్స్ విభాగం స్పష్టం చేసింది. యూరోపియన్ దేశం నుంచి వచ్చిన ఓ కంసైన్ మెంట్ పై అనుమానం రావడంతో కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు తనిఖీ చేసినట్లు పేర్కొంది. రెండు అట్టపెట్టేల్లో ప్యాక్ చేసిన సీల్ చేసిన 24 బాటిళ్ల క్రాటోమ్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీసాలలో లిక్విడ్ క్రాటోమ్ అని పిలువబడే మిట్రాజినా స్పెసియోసా అనే రసాయనం ఉంటుందని, తదుపరి పరిశోధనల కోసం సంబంధిత విభాగాలకు వాటిని తరలించినట్లు కువైట్ కస్టమ్స్ విభాగం తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







