స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన సౌదీ విద్యాశాఖ

- November 18, 2022 , by Maagulf
స్కాలర్‌షిప్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానించిన సౌదీ విద్యాశాఖ

రియాద్ : 2023–2024 విద్యా సంవత్సరానికి, సౌదీ విద్యా మంత్రిత్వ శాఖ తన మూడవ ఎడిషన్‌లో స్కాలర్‌షిప్‌ల కోసం ట్రాక్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు  ప్రకటించింది. https://moe.gov.sa/ar/education/Pages /Scholarship.aspx లో "సఫీర్ 2" ప్లాట్‌ఫారమ్ ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 2023 మే 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. 2023 జూన్ లో ప్రారంభమయ్యే తర్వాత ఫలితాలను ప్రకటించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ట్రాక్ ఆఫ్ ఎక్సలెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ట్రాక్‌లోని ఎలక్ట్రానిక్ పోర్టల్ అందించే నిబంధనలు, నియంత్రణలు, అందుబాటులో ఉన్న మేజర్‌లు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల జాబితాను జాగ్రత్తగా చూడాలని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com