మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సంస్థలు తమ వైఖరి మార్చుకున్నాయి

- April 23, 2016 , by Maagulf
మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సంస్థలు తమ వైఖరి మార్చుకున్నాయి

అమెరికా టెక్నాలజీ రంగంలో దాదాపు దశాబ్దం పాటు శత్రువుల్లా ఉన్న మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ సంస్థలు తమ వైఖరి మార్చుకున్నాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడానికి స్వస్తి పలికి శాంతి ఒప్పందానికి వచ్చాయి. రెండు కంపెనీలు కూడా ఇక మీదట ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోబోమని తెలిపాయి. గూగుల్‌పై చేసిన ఫిర్యాదులను వెనక్కి తీసుకుంటున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. కంపెనీ న్యాయపరమైన ప్రాధాన్యతలను మార్చుకోవడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. లీగల్‌ ప్రొసీడింగ్స్‌లో కాకుండా మెరిట్స్‌, ఉత్పత్తుల్లో పోటీ పడతామని గూగుల్‌ వెల్లడించింది.గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ల ఫిర్యాదులకు సంబంధించి యునైటెడ్‌ స్టేట్స్‌, జర్మనీల్లో 18 కేసులు ఉన్నాయి. గత సెప్టెంబరులోనే రెండు కంపెనీలు పేటెంట్‌ ఉల్లంఘనలకు సంబంధించి రాజీకి వచ్చాయి. ఇప్పుడు ఒకరిపై ఒకరు చేసిన రెగ్యులేటరీ ఫిర్యాదులన్నీ వెనక్కి తీసుకోవడానికి ఒప్పందం కుదిరినట్లు గూగుల్‌ స్పష్టంచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com