దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకోనున్నా మనోజ్ బాజ్‌పేయ్..
- April 23, 2016
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పేయ్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుని అందుకోనున్నారు. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన 'అలీగర్' చిత్రంలో అద్భుత నటనకు గాను ఉత్తమ నటుడు విభాగంలో మనోజ్ ఈ అవార్డుకి ఎంపికయ్యారు.ఈ సందర్భంగా మనోజ్ స్పందిస్తూ 'నాపై ఇంతటి ప్రేమాభిమానాలు, ప్రశంసలు కురిపించినందుకు గాను అందరికీ కృతజ్ఞతలు' అంటూ ట్వీట్‌చేశారు. నేడు ఆయన పుట్టినరోజు కావడం విశేషం. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికైనందుకు గాను పలువురు బాలీవుడ్ నటీనటులు మనోజ్‌కు అభినందనలు తెలియజేశారు.ఆదివారం ముంబయిలో జరగనున్న ఓ కార్యక్రమంలో ఈ అవార్డును మనోజ్ అందుకోనున్నారు. ఈనెల 30న దాదా సాహెబ్ ఫాల్కే 147వ జయంతిని పురస్కరించుకుని దాదాసాహెబ్ ఫిల్మ్ ఫౌండేషన్ ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించనుంది.ఉత్తరప్రదేశ్‌లోని అలీగర్ యూనివర్సిటీలో స్వలింగ సంపర్కుడైన శ్రీనివాస్ రామచంద్ర సిరాస్ అనే ఓ మరాఠా బోధకుడి మనోవ్యధను ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రను మనోజ్ బాజ్‌పేయ్ పోషించారు. ఫిబ్రవరి 26న విడుదలైన ఈ చిత్రం పలువురు విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







