ముస్సఫా తెలుగు అసోసియేషన్ ఉగాది వేడుకలు అబుదాబి.

- April 23, 2016 , by Maagulf


ముస్సఫా లో ఏప్రిల్ 22 సాయంత్రం ఉగాది వేడుకలు అత్యంత సంబరంగా జరిగాయి. దీనికి ప్రముఖులు శ్రీ కొల్లు రవీంద్ర గారు హాజరు అయ్యారు.
శ్రీ కొల్లు రవీంద్ర గారు, ముస్సఫా తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ షేక్ నాగూర్ గారు వారి సతీమణి శ్రీమతి డాక్టర్ మునవర్ గారు, ప్రముఖ పారిశ్రామికవేత్త జజీర్ ఎమిరేట్స్ పవర్ అధినేత శ్రీ దువ్వూరి కిషోర్ బాబు గారు వారి సతీమణి దీపిక గారు, ప్రముఖ మానసిక వైద్యనిపుణులు శ్రీ డాక్టర్ పద్మరాజు గారు వారి సతీమణి డాక్టర్ సంధ్య రాణి గారు, వేవ్ రెజోనన్స్ అధ్యక్షులు గీత రమేష్ గారు, శ్రీ రావెళ్ళ రమేష్ గారు, ప్రముఖ న్యాయవాది శ్రీమతి అనురాధ గారు, శ్రీ సురేష్ వోబ్బిలి శెట్టి గారు, శ్రీ షణ్ముఖ గారు జ్యోతి ప్రజ్వలన చేసారు.
ముస్సఫా తెలుగు అసోసియేషన్ మంత్రివర్యులను సన్మానించారు. మంత్రివర్యులు సభికులకు చక్కని ఉపన్యాసం ఇచ్చారు. 
మాగల్ఫ్.కామ్ నుంచి శ్రీ శ్రీకాంత్ గారు, గామ అవార్డ్స్ నుంచి త్రిమూర్తులు కేసరి హాజరయ్యారు.
సుమధుర గాత్ర కోవిద సుమగారు తన చక్కటి యాంకరింగ్ తో సభికులను అలరించారు. జబర్దస్త్ టీమ్ నుండి గాలిపటాల సుధాకర్, బుల్లెట్ భాస్కర్ తన సహజమైన హాస్య కళతో వేడుకలను అత్యంత ఉత్సాహభరితంగా చేసారు.టీవీ నటులైన గ్రీష్మ, ప్రియ, హిమజ తమ నాట్యాలతో సభికులను ఆనందపరిచారు. 
ప్రముఖ కూచిపూడి నృత్యురాలు కుమారి మహతి తన నాట్యంతో మంత్రముగ్ధులను చేసారు.
చిన్నచిన్న పిల్లలు, స్త్రీలు తమ నాట్యంతో ప్రజలను అలరించారు.
ఈ కార్యక్రమానికి తెలుగు స్రవంతి అధ్యక్షులు శ్రీ ప్రుద్వీరాజ్ గారు వారి సతీమణి రోజగారు, సంస్కృతి శ్రీమతి & శ్రీ అక్కినేని అనిల్ హాజరు అయ్యారు.
ఈ ఈవెంట్ స్పాన్సర్ గా జజీర్ ఎమిరేట్స్ పవర్ అధినేత దువ్వూరి కిషోర్ బాబు గారు, చెస్ అధినేత్రి డాక్టర్ మునవర్ నిలిచారు.ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి దగ్గరగా రామకృష్ణ వెనుజుల నుంచి మద్దిరాల రోసి రెడ్డి మరియు కొడాలి రాజేంద్ర వరప్రసాద్ గారు స్పాన్సర్ గా వ్యవహరించారు.
షడ్రసోపేతమైన ఉగాది పచ్చడితో ఆ సాయంత్రం ఒక మధురస్మ్రుతిగా నిలిచింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com