'రైట్ రైట్' సినిమా..
- April 24, 2016
అతనో కండెక్టర్. పొద్దుట నుంచి సాయంత్రం వరకూ బస్సులోనే ప్రయాణం, బస్సుతోనే ప్రణయం. అయితే మధ్యలో 'ప్రేమ స్టాప్' కూడా ఉంది. ఓ అమ్మాయి కోసం అతని కళ్లు సెర్చ్ లైట్లా మారిపోయి వెదుకుతుంది. ఆ అమ్మాయికీ తనంటే ఇష్టమే. అందుకే ఇద్దరు ఆ ఎర్రబస్సులోనే ప్రేమ పాటలు పాడుకొన్నారు. ఆ బస్సులోనే హనీమూనికీ వెళ్దామనుకొన్నారు. అంతలో అనుకోని మలుపొచ్చింది. కండెక్టర్ జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. అదేంటి? ఆ తరవాత ఏం జరిగింది? ఈ విషయాలు తెలుసుకోవాలంటే 'రైట్ రైట్' సినిమా చూడాల్సిందే. సుమంత్ అశ్విన్, ప్రభాకర్, పూజా జవేరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. మను దర్శకుడు. జె.వంశీకృష్ణ నిర్మాత. 'రైట్ రైట్' ప్రచార చిత్రాన్ని ఇటీవల హైదరాబాద్‌లో ప్రముఖ దర్శకులు బి.గోపాల్, వంశీ పైడిపల్లి, మారుతి సంయుక్తంగా విడుదల చేశారు.అనంతరం బి.గోపాల్ మాట్లాడుతూ ''రైట్ రైట్ అన్నది సుపరిచితమైన పదం. మంచి టైటిల్ పెట్టడంలోనే సగం విజయం ఉంది. ఈ చిత్రం సుమంత్‌కి మంచి విజయాన్ని అందివ్వాలి. ఎమ్మెస్ రాజు చేతుల మీదుగా ఎంతోమంది దర్శకులు వెలుగులోకి వచ్చారు. ఈ సినిమాతో మనుకీ మంచి పేరు రావాల''ని ఆకాంక్షించారు. మారుతి చెబుతూ ''సినిమాపై ఫ్యాషన్ ఉన్న టీమ్ ఇది. పోస్టర్ చూసినప్పుడే కొత్తగా ఫీలయ్యా. సుమంత్ అశ్విన్ రొటీన్‌కి భిన్నంగా కొత్త కథలతో ప్రయాణం సాగిస్తున్నాడు. తన ఖాతాలో ఈ చిత్రంతో మరో విజయం చేరాల''ని ఆకాంక్షించారు. ''సుమంత్ మంచి దర్శకుడు అవుతాడనుకొన్నా. నటుడిగా మారి షాక్ ఇచ్చాడు. అయితే తాను ఎంచుకొన్న దారిలో విజయం సాధించడం ఆనందాన్నిచ్చింద''న్నారు వంశీపైడిపల్లి. ''డ్రైవర్, కండక్టర్ మధ్య జరిగే కథ ఇది. ప్రభాకర్ నటన చూసి అంతా ఆశ్చర్యపోతారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు దర్శక నిర్మాతలు. సంగీతం: జె.బి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







