‘#NC22’.. చైతూ ఆవేశాన్ని ఆపే శక్తి ఏదీ లేదా.?
- November 22, 2022అక్కినేని హీరో నాగ చైతన్య కొత్త సినిమా కోసం తమిళ విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి పని చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ కాస్టింగ్‌తో పాటూ, స్టార్ టెక్నీషియన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.
బేబమ్మ కృతి శెట్టి ఈ సినిమాలో చైతూకి జోడీగా నటిస్తోంది. హ్యాండ్సమ్ హీరో అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. కాగా, ఈ సినిమాకి సంబంధించి లేటెస్టుగా ఓ అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్లు.
‘అతని ఆవేశాన్నీ ఏ శక్తీ ఆపలేదు..’ అనే క్యాప్షన్‌తో కూడిన ప్రీ లుక్ రిలీజ్ చేసి, చైతూ రోల్‌ని రిలీజ్ చేశారు. ‘శివ’ అనే పోలీసాఫీసర్ పాత్రలో చైతూ నటిస్తున్నాడు. చైతూ యొక్క శక్తిని పరిచయం చేసేలా వుంది ఈ ప్రీ లుక్ పోస్టర్. రేపు అనగా, నవంబర్ 23న చైతూ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమాకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసి, చైతూకి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలపనుంది చిత్ర యూనిట్.
కాగా, ఈ సినిమాని తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తున్నారు. బైలింగ్వల్ మూవీగా రూపొందుతోన్న ఈ సినిమా నాగ చైతన్య కెరీర్ టర్నింగ్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?