దుబాయ్ సూపర్ సేల్..
- November 23, 2022
దుబాయ్: దుబాయ్ లోని నివాసితులు, ప్రవాసుల కోసం దుబాయ్ మరో సూపర్ సేల్‌ను తీసుకువస్తోంది.మూడు రోజుల పాటు ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. దుబాయ్ సూపర్ సేల్ భాగంగా వివిధ బ్రాండ్లకు చెందిన వస్తువులపై ఏకంగా 90 శాతం వరకు డిస్కౌంట్స్ ఉంటాయని దుబాయ్ ఫెస్టివల్స్ అండ్ రిటైల్ ఎస్టాబ్లిష్మెంట్ వెల్లడించింది. ఈ నెల 25వ తేదీ (శుక్రవారం) నుంచి 27 (ఆదివారం) వరకు మూడు రోజుల పాటు సేల్ జరుగుతుంది.ఇక ఈ సేల్‌లో భాగంగా లైఫ్‌స్టైల్, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ ఇలా ప్రతి వస్తువు కొనుగోళ్లపై బ్రాండ్లను బట్టి 90శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
కాగా, ఈ సేల్ దుబాయ్ నగర వ్యాప్తంగా ఉన్న మాల్ ఆఫ్ ది ఎమిరేట్స్, దీరా సిటీ సెంటర్, మిర్డీఫ్ సిటీ సెంటర్, దుబాయ్ మాల్, దుబాయ్ మరీనా మాల్, దుబాయ్ హిల్స్ మాల్, మెర్కాటో, జుమేర్హా టౌన్ సెంటర్, ఐబిన్ బట్టుటా, సర్కిల్ మాల్, ది పాయింట్, నఖీల్ మాల్, గేట్ అవెన్యూ డీఐఎఫ్సీ, ఫెస్టివల్ ప్లాజా, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్, ద ఔట్లెట్ విలేజ్, అల్ సీఫ్, బ్లూవాటర్స్, జుమేర్హా బీచ్ రెసిడెన్స్, సిటీ వాక్, లా మెర్ షాపింగ్ హబ్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇక దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ స్టోర్స్‌లో సేల్ అందుబాటులో ఉండే మూడు రోజుల పాటు కనీసం 1000 దిర్హాముల షాపింగ్ చేసే కస్టమర్లకు 30వేల దిర్హాములు విలువ చేసే గిఫ్ట్ కార్డు గెలుచుకునే అవకాశం కూడా ఉంది.
తాజా వార్తలు
- టాటా డిజిటల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత
- ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ
- కొత్త లేబర్ కోడ్ల అమలు
- దుబాయ్ ఎయిర్ షో: కుప్పకూలిన భారత్ కు చెందిన తేజస్ యుద్ధవిమానం
- తెలంగాణ: 25వ తేదీన క్యాబినెట్ భేటీ
- ఏపీ ప్రజలకు శుభవార్త..
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!







