గొప్ప మనసు చాటుకున్న ఏపీ సీఎం జగన్

- November 23, 2022 , by Maagulf
గొప్ప మనసు చాటుకున్న ఏపీ సీఎం జగన్

అమరావతి: ఏపీ సీఎం జగన్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైయ‌స్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన సంగతి తెలిసందే. అంతకు ముందు ఈ సభలో పాల్గొనేందుకు జగన్ వెళ్తుండగా.. ఆయన్ను చూసిన కొంతమంది కలవడానికి ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఆ రద్దీలో ఉన్న ఓ చిన్నారిని గమనించిన జగన్.. ‘సభ దగ్గరకు తీసుకురండి.. నేను చూసుకుంటా’ అని సైగ చేశారు. సభా ప్రాంగణం వద్దకు చేరుకున్న వారిని గుర్తించిన జగన్ వారితో మాట్లాడారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని పలకరించి భయపడొద్దని భరోసా ఇచ్చారు. ఇకపై, అంతా తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు.

చిన్నారికి ఇండియాలోనే కాదు.. ప్రపంచంలో ఎక్కడున్నా చికిత్స అందించాలని అక్కడే ఉన్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌కు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే, చిన్నారికి అవసరమైన ఆపరేషన్ చేయించాలన్నారు. అక్కడికక్కడే చిన్నారికి రూ. 10 వేలు పెన్షన్ మంజూరు చేశారు. చిన్నారి పట్ల సీఎం జగన్ చూపించిన ప్రేమకు అక్కడున్న వారంతా ఆశ్చ్ర్యపోతూ జగన్ కు జై జైలు కొట్టారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com