ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు
- November 24, 2022
అమరావతి: ఏపీకి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా గిడుగు రుద్రరాజు ను నియమించారు. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్లుగా మస్తాన్ వలీ, జంగా గౌతమ్, సుంకర పద్మశ్రీ, రాకేశ్ రెడ్డిలను అధిష్టానం నియమించింది. ఇప్పుడున్న శైలజానాథ్ ను పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించి.. ఆయన స్థానంలో రుద్రరాజుకు అవకాశం ఇచ్చింది. 18 మందితో పొలిటికల్ అఫైర్స్ కమిటీతో పాటు 34 మందితో కో ఆర్డినేషన్ కమిటీని నియమిస్తూ.. ఏఐసీసీ బుధవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది.
ఏపీ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా నియమితులైన గిడుగు రుద్రరాజు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి. సౌమ్యుడు, వివాహ రహితుడిగా పేరుంది. పార్టీలో సీనియర్ నేత. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్‌తో పాటు కేవీపీకు సన్నిహితుడిగా మెలిగారు. చిన్నతనం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే పెరిగిన గిడుగు రుద్రరాజు..పార్టీకు అత్యంత విధేయుడు.
ఇక కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లిఖార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఏపీలో కూడా నాయకత్వాన్ని పూర్తిగా మార్చేశారు.
తాజా వార్తలు
- Dh5,000 సాలరీ పరిమితి ఎత్తివేత.. బ్యాంకులు రుణాలిస్తాయా?
- ఒమన్ లో మిలిటరీ పరేడ్ వీక్షించిన ది హానరబుల్ లేడీ..!!
- నకిలీ స్మార్ట్ఫోన్ల విక్రయం..ముగ్గురు ప్రవాసులు అరెస్టు..!!
- బహ్రెయిన్ వరుసగా రోడ్డు ప్రమాదాల పై ఆందోళన..!!
- పబ్లిక్ హెల్త్ ప్రమోషన్లో ప్రైవేట్ పాత్ర కీలకం..!!
- ఖతార్ లో NCD స్క్రీనింగ్ కేంద్రాలు పెంపు..!!
- మయన్మార్ చెర నుంచి 55 మందిని విడిపించిన ప్రభుత్వం
- మిస్ యూనివర్స్ గా థాయ్ లాండ్ సుందరి
- సాయి సన్నిధిలో ఘనంగా 11వ ప్రపంచ సదస్సు
- మనీలాండరింగ్ కు వ్యతిరేకంగా కువైట్, ఇండియా చర్చలు..!!







