శ్రీవారి భక్తులకు అందుబాటులో టీటీడీ 2023 క్యాలెండర్లు, డైరీలు..
- November 27, 2022
టీటీడీ 2023 క్యాలెండర్లు, డైరీలు.. శ్రీవారి భక్తులకు అందుబాటులోకి..
తిరుమల: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఆసక్తి చూపిస్తారు.అలాగే టీటీడీ క్యాలెండర్లు, డైరీలకు కూడా అంతే డిమాండ్ ఉంటుంది.దీంతో టీటీడీ ప్రతేడాది శ్రీవారి డైరీలు, క్యాలెండర్లను భక్తులకు అందుబాటులో ఉంచుతుంది.ఈ క్రమంలోనే 2023 క్యాలెండర్లు, డైరీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్, తిరుమల, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో విక్రయిస్తోంది. దీంతోపాటు టీటీడీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఆలయ ఈవో పేరుతో డీడీలు పంపి డైరీలు, క్యాలెండర్లు పొందే సౌకర్యం కల్పించారు. ఇప్పటికే అమెజాన్ వంటి ఈ-కామర్స్ సంస్థలు భక్తులకు విక్రయిస్తున్నాయి.
ఒక్కో డైరీకి ఒక్కో ధర నిర్ణయించింది. పెద్ద డైరీ రూ.150, చిన్న డైరీ రూ.120. ఇక తిరుమల క్యాలెండర్ రూ.130, టేబుల్ క్యాలెండర్ రూ.75గా నిర్ణయించారు. అయితే వీటి ధర కంటే సర్వీస్ చార్జ్ ఎక్కువగా ఉంది. ఒక్కో డైరీకి రూ.133, ఇక బల్క్‌లో 10 డైరీలు ఒకేసారి బుక్ చేసుకుంటే రూ.379 సర్వీస్ చార్జ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







