నేను బాగానే ఉన్నాను: కమల్ హాసన్
- November 28, 2022
చెన్నై: లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో భారీ విజయం సాధించి గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితం కమల్ హాసన్ అస్వస్థతకి గురయి హాస్పిటల్ లో చేరారు. కమల్ హాసన్ హాస్పిటల్ లో చేరారు అనడంతో ఈ వార్త బాగా వైరల్ అయింది. అయితే ఆయన కోలుకొని బయటకి వచ్చేశారు. తాజాగా కమల్ ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.
విజయ్ సేతుపతి హీరోగా, పొన్రామ్ దర్శకత్వంలో తెరకెక్కిన DSP సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమాని మరో దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కమల్ హాసన్ ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో కమల్ తన ఆరోగ్యం గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
DSP ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో కమల్ హాసన్ మాట్లాడుతూ.. ”ఒకప్పుడు పెద్ద ప్రమాదానికి గురయినా పరామర్శించి, తర్వాత మళ్ళీ ఎప్పుడు నటిస్తున్నారు అని అడిగేవారు. కానీ ఇప్పుడు చిన్నగా కాలు గీరుకుపోయినా పెద్దగా ప్రచారం చేసేస్తున్నారు. మీడియా, అభిమానం ఈ రెండూ దీనికి కారణం. నేను దగ్గు వచ్చి, జ్వరం వచ్చి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాను అంతే. ప్రస్తుతం బాగున్నాను” అని తెలిపారు.
ఇక విజయ్ సేతుపతి గురించి మాట్లాడుతూ.. ”ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి కోసమే వచ్చాను. తను కూడా నాలాగే సినీ ప్రేమికుడు. ట్రైలర్ చాలా బాగుంది. సినిమా మంచి విజయం సాధించాలి” అని అన్నారు. ఇక ఈవెంట్ లో వేదికపై విజయ్ సేతుపతి మోకాళ్ల మీద కూర్చొని కమల్ కి పుష్పగుచ్ఛం ఇవ్వగా భవిష్యత్‌లో విజయ్ సేతుపతికి కూడా ఎవరో ఒకరు ఇలా ఇస్తారు అని అన్నారు కమల్. కమల్ బయట ఈవెంట్ లో కనపడి ఆరోగ్యంగానే ఉన్నాను అని తెలపడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్: కొలంబో నుండి కువైట్‌కు వారానికి 6 విమానాలు
- ఖతార్‌లో విద్యార్థులకు హీట్‌వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్‌గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్‌లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్‌లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







