సాయి పల్లవి పై ఈ రూమర్లేంటీ.? నిజమేనా.?
- November 29, 2022
హైబ్రీడ్ పిల్ల.. ఒక్కటే పీస్.. అంటూ ‘ఫిదా’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. అవును నిజమే. హీరోయిన్ల యందు సాయి పల్లవి వేరయా అని నిస్సందేహంగా అనేయొచ్చు.
లేడీ పవర్ స్టార్ అంటూ అభిమానులు సాయి పల్లవిని ముద్దుగా పిలుచుకుంటారు. ఇంత గొప్ప ఇమేజ్ దక్కించుకున్న సాయి పల్లవి ఇకపై సినిమాల్లో నటించదా.? అంటే ఓ గాసిప్ తాజాగా చక్కర్లు కొడుతోంది.
సాయి పల్లవి డాక్టర్ అన్న సంగతి తెలిసిందే. జార్జియాలో ఎమ్‌బిబియస్ పూర్తి చేసిన సాయి పల్లవి సినిమాలపై ఆసక్తితో నటిగా మారింది. ఎప్పుడు తనకు సినిమాల్లో అవకాశాలు తగ్గుతాయో, అప్పుడు డాక్టర్ వృత్తిని కొనసాగిస్తా.. అని గతంలో పలుమార్లు చెప్పింది సాయి పల్లవి.
ఆ సమయం వచ్చినట్లుందనిపిస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో సినిమాలేమీ లేవు. సో, ఆమె యాక్టింగ్‌కి గుడ్ బై చెప్పేసి, డాక్టర్‌గా కొనసాగాలనుకుంటోందని ప్రచారం జరుగుతోంది. కానీ, ఇప్పుడు అవకాశాలు లేకపోతే లేకపోవచ్చు. కానీ, మంచి అవకాశాలు వస్తే, నటించేందుకు సాయి పల్లవి రెడీగానే వుంటుందని, ఖాళీ సమయాన్ని వృథా చేయకుండా, డాక్టర్ ప్రొఫిషన్తో బిజీ కానుందని మరోపక్క ప్రచారం జరుగుతోంది.
తాజా వార్తలు
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!







