టిల్లుగానికి హ్యాండ్ ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్.!
- November 29, 2022
సిద్దు జొన్నలగడ్డ.. విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్.. ఇలా నేటి తరం హీరోల్లో ఆటిట్యూడ్ కా బాప్ అని చెప్పుకునే వాళ్ల వరుసలో మనోడి పేరు కూడా వుంటుందండోయ్.
పిచ్చ ఆటిట్యూడ్ చూపిస్తుంటాడు సిద్దు జొన్నలగడ్డ. మంచి టాలెంటెడ్. కేవలం నటుడు మాత్రమే కాదు.టెక్నికల్ విభాగంలోనూ వేలు పెట్టగల సమర్ధుడు. అయితే మాత్రం ఆ ఆటిట్యూడ్ తట్టుకోవడమే కాస్త కష్టం.
‘డీజె టిల్లు’ అంటూ వచ్చి సెన్సేషనల్ విజయం అందుకున్నాడు. నిర్మాతలకు మాంచి లాభాలు తెచ్చిపెట్టాడు ఈ సినిమాతో మన ఆటిట్యూడ్ హీరో. దాంతో, ‘టిల్లు 2’ కి అన్ని రకాల నిర్మాతల నుంచి ఫ్రీడమ్ పొందేశాడు మనోడు.
దాంతో, సెట్స్‌లో సిద్దు చేసే హంగామా అంతా ఇంతా కాదు, ఆ ఓవర్ ఆటిట్యూడ్ తట్టుకోలేక మొదట డైరెక్టర్ హ్యాండ్ ఇచ్చాడు. విమల్ కృష్ణ డైరెక్ట్ చేయాల్సిన ఈ సినిమాని ఇప్పుడు మాలిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నాడు.
హీరోయిన్‌గా మొదట శ్రీలీలను అనుకున్నారు. హీరోతో టెర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ అవ్వకే శ్రీలీల నో చెప్పేసిందన్న టాక్ వుంది. ఆ ప్లేస్‌లో అనుపమ వచ్చి చేరింది. కొంత షూటింగ్ చేశాక అనుపమ కూడా అడ్జస్ట్ కాలేకపోయింది. సింపుల్‌గా ప్రాజెక్ట్‌కి గుడ్ బై చెప్పేసింది. తాజాగా మడోనా సెబాస్టియన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయ్యింద.ి ఈమె పరిస్థితి ఎలా వుంటుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- టిటిడిలో అనిల్ కుమార్ సింఘాల్ మార్కుపాలన షురూ!
- భారత్‌లో మెటా అండర్‌సీ కేబుల్ ప్రాజెక్ట్ ప్రారంభం
- ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు లో భారీ ఉద్యోగాలు...
- మెంటల్ హాస్పటల్‌గా రుషికొండ ప్యాలెస్?
- తెలంగాణలో మినరల్స్ నిక్షేపాలు
- జులీబ్, షువైఖ్ పారిశ్రామిక ప్రాంతంలో స్పెషల్ డ్రైవ్..!!
- గాజా కోసం అమెరికా శాంతి ప్రణాళిక..మొదటి దశపై బహ్రెయిన్ ప్రశంసలు..!!
- సముద్ర నావిగేషన్‌ను పునఃప్రారంభించిన ఖతార్..!!
- జాయెద్ ఇంటర్నేషనల్‌లో డిజిటల్ టూరిస్ట్ వాలెట్ ప్రారంభం..!!
- ప్రమాద బాధితుల వీడియో రికార్డ్..ఒమన్‌లో వ్యక్తి అరెస్టు..!!