రష్యాలో ‘పుష్ప’ ప్రమోషన్లు అదరగొడుతున్నారు కానీ.!
- November 29, 2022
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ అనూహ్యమైన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తెలుగులో ఊహించని వసూళ్లు కొల్లగొట్టిన ‘పుష్ప’, రీసెంట్‌గా బాలీవుడ్‌లోనూ రిలీజై రికార్డు వసూళ్లు సాధించింది.
ఇక, ఇప్పుడు ఈ సినిమాని రష్యాలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. డిశంబర్ 8న ‘పుష్ప’ రష్యాలో రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారు.
ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. రష్యన్ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేసిన ‘పుష్ప’ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కూడా మంచి విజయం అందుకుంటే, తెలుగు సినిమాకి రష్యాలో సరికొత్త శకం మొదలవుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
రీసెంట్‌గా జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అక్కడ కూడా మంచి విజయం అందుకుంది ‘ఆర్ఆర్ఆర్’. అలాగే రష్యాలో ‘పుష్ప’ కూడా అంచనాలు అందుకుంటే, తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా మరింత పాతుకుపోతుందని తెలుగు సినీ జనం ఆశగా ఎదురు చూస్తున్నారు.
అంతా బాగానే వుంది కానీ, రష్యన్ రిలీజ్ ప్లాన్ చేసిన ‘పుష్ప’ అండ్ టీమ్, క్యాలెండ్ మారిపోతున్నా, ‘పుష్ప 2’ని ఇంకా పట్లాలెక్కించలేకపోతోంది ఎందుకో.!
తాజా వార్తలు
- అమెరికన్ ప్రతినిధుల బృందంతో సీఎం భేటీ..
- ఏపీ: త్వరలో భారీగా పోలీస్ నియామకాలు..
- ట్రాన్స్జెండర్ల వేధింపులపై ట్వీట్: సీపీ సజ్జనార్
- చంద్రబాబు పేదవాడికి భవిష్యత్ లేకుండా చేస్తున్నారు – జగన్
- మిడిల్ ఈస్ట్ లో శాశ్వత శాంతి కోసం బహ్రెయిన్ పిలుపు..!!
- విషాదం..దుక్మ్ ప్రమాదంలో మరణించిన వ్యక్తుల గుర్తింపు..!!
- దుబాయ్-ఢిల్లీ ప్రయాణికులకు షాకిచ్చిన స్పైస్‌జెట్..!!
- GCC e-గవర్నమెంట్ అవార్డుల్లో మెరిసిన ఖతార్..!!
- కువైట్ లో ట్రాఫిక్ ఉల్లంఘనల పై భారీ జరిమానాలు..!!
- నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న సౌదీ శాస్త్రవేత్త ఒమర్ యాఘి..!!