ఇకపై రీమేక్ సినిమాలు చేయనంటోన్న రామ్ చరణ్.!

- November 30, 2022 , by Maagulf
ఇకపై రీమేక్ సినిమాలు చేయనంటోన్న రామ్ చరణ్.!

ఓటీటీ ట్రెండ్ వచ్చాకా, ఇతర భాషా సినిమాలు.. ఆ మాటకొస్తే, హాలీవుడ్ సినిమాలను సైతం తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు. 
ఇక కంటెంట్ నచ్చిన సినిమాలు తెలుగులో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో రీమేకుల ట్రెండ్ నడుస్తోంది. అయితే, వన్స్ రీమేక్ రైట్స్ తీసుకున్నాకా, ఆ సినిమాని తెలుగులో డబ్ చేయడం కానీ, ఇతరత్రా శాటిలైట్ ఛానెళ్లలో ప్రదర్శించడం కానీ జరిగేది కాదు. 
కానీ, ఇప్పుడు ప్రతీ సినిమానీ తెలుగులో డబ్ చేసి, ఓటీటీలో వదులుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆ సినిమా రీమేకులకు పెద్దగా ఆదరణ దక్కడం లేదు. ఈ మధ్య ‘గాడ్ ఫాదర్’ సినిమాకి అదే పరిస్థితి ఎదురైంది. స్టార్ వేల్యూతో ఎలాగోలా కొట్టుకుపోయిందంతే ‘గాడ్ ఫాదర్’.
అందుకే, నిర్మాతగా చరణ్ ఓ డెసిషన్ తీసుకున్నాడట. ఓటీటీలో ఆల్రెడీ ప్రదర్శించబడుతున్న సినిమాలను రీమేక్ చేయకూడదని అనుకుంటున్నాడట. అలాగే, రీమేకుల జోలికి వెళ్లడం కాస్త తగ్గించాలని అనుకుంటున్నట్లు చరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
సాటి నిర్మాతగా ఓటీటీ సినిమాలకు రీమేకులు చేయకూడదన్న షరతు కూడా పెట్టాలనుకుంటున్నట్లు చరణ్ వ్యాఖ్యానించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com