ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బందర్ పోర్ట్ నిర్మాణం
- April 24, 2016
ప్రపంచంలో అతిపెద్ద జెబెల్ ఆలి పోర్ట్ దుబాయ్‌లో పరిశీలించిన మంత్రి కొల్లు రవీంద్ర
దుబాయ్‌లోని జెబెల్ ఆలి పోర్ట్‌ను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో బందర్ పోర్టును నిర్మించాలనే ధ్యేయంతో మంత్రి కొల్లు రవీంద్ర ప్రపంచంలో అతిపెద్ద పోర్ట్ అయిన జెబెల్ పోర్ట్‌ను దుబాయ్‌లో ఈరోజు పరిశీలించడం జరిగింది. త్వరలో బందర్లో నిర్మించతలపెట్టే పోర్ట్‌కు అనువైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, అక్కడ పోర్ట్ నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. దీంతోపాటు అలీ అండ్ సన్స్ ఆఫ్సోర్ మరియు మెరైన్ సాంకేతిక నిపుణుల బృందంతో భేటి అయ్యారు. ఈసందర్భంగా పోర్ట్ నిర్మాణం, షిప్‌ల తయారు, రిపేరి, జెట్టి నిర్మాణం, షిప్ లిప్ట్ లు మరియు షిప్ బిల్డింగ్స్ నిర్మాణం, ఎక్స్‌పోర్ట్స్, మెరైన్ సర్వీసులు తదితర అంశాలపై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర అలీ అండ్ సన్స్ సాంకేతిక నిపుణులను బందర్‌కు ఆహ్వానించడం జరిగింది. బందర్ పోర్ట్ నిర్మాణం, అభివృద్ధిలో వారి సహాయ సహకారాలు కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కొల్లూరి శివకుమార్, మాగల్ఫ్ శ్రీకాంత్, నాగూర్ షేక్‌లు పాల్గొన్నారు.



తాజా వార్తలు
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలను పెంచే ప్రయత్నాలు..యూఏఈ హెచ్చరిక..!!







