బడిలో ఉగ్రవాదుల దాడి.. 16 మంది చిన్నారుల మృతి..
- November 30, 2022
అఫ్గానిస్థాన్: అఫ్గానిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి కలకలం సృష్టించారు. ఓ బడిలో బాంబు దాడికి పాల్పడి 10 మంది చిన్నారుల ప్రాణాలు తీశారు. మరో 24 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర అఫ్గానిస్థాన్ లోని అయ్‌బాక్ లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై తాలిబన్ సర్కారు అధికారులు ఓ ప్రకటన చేశారు. అయితే, మతపర అంశాలు బోధించే ఆ బడిలో ఎవరు ఈ దాడికి పాల్పడ్డారన్న విషయంపై వివరాలు తెలియరాలేదు.
ఈ దాడికి బాధ్యతవహిస్తూ ఇప్పటివరకు ఏ ఉగ్ర సంస్థా ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరిగినప్పటి నుంచి ఆ దేశంలో తాలిబన్ల పాలన మొదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అఫ్గాన్ లో పదే పదే దాడులు జరుగుతున్నాయి.
ఆకలి కేకలు, తాలిబన్ల ఆంక్షలు, స్వేచ్ఛ లేకపోవడం, ఉపాధి కరవవడంతో పాటు మరోవైపు ఉగ్రవాదులతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. తమ పంతాన్ని నెరవేర్చుకోవడానికి చిన్నారులను కూడా లక్ష్యంగా చేసుకుని పలు ఉగ్ర సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దాడులకు తెగబడుతూ కలకలం రేపుతున్నారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







